ముత్తారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం (మ) పోలీస్ స్టేషన్ ను డీసీపీ భూక్యా రామ్ రెడ్డి సందర్శించారు. పెద్దపల్లి జోన్ డీసీపీ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తోలిసారిగా ముత్తారం (మ) పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఫిర్యాదుల సమస్య సత్వర పరిష్కారం కి కృషి చేస్తూ బాధితులకు పోలీసులు పై నమ్మకం భరోసా కలిగే విధంగా వ్యవహరించాలి అని సూచించారు.
అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ ఐ ని అడిగి తెలుసుకోవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు. డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, సీఐ బి. రాజు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


