మండపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ళ కు సత్కారం…
త్రినేత్రం న్యూస్.. మండపేట నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉండేలా కృషి చేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయం లో శనివారం మండపేట వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఆయన్ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ విలీనం కు సంబంధించి జరిగిన పరిణామాలు వివరించారు. రాజమహేంద్రం తో ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఇక రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా అతి దగ్గరగా ఉండేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు.
తొలుత ఏడిద సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఎమ్మెల్యే వేగుళ్ళ కు కిరీటాన్ని అలంకరించి శాలువా తో సత్కరించారు. ఏడిద సీతానగరం సర్పంచ్ వరదా చక్రవర్తి, కేశవరం ఎంపీటీసీ అన్నందేవుల కృష్ణారావు, వైఎస్ ఎంపీపీ లు పసుమర్తి నాగేశ్వరరావు, గజ్జి వెంకట రమణ తదితరులు ఆయన్ని సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


