త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రూడా) చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ బొడ్డు వెంకటరమణ చౌదరీ, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గౌరవ గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న రాజకీయ కార్యక్రమాలు, ప్రజాసేవలో మరింత సమర్థవంతమైన కార్యాచరణపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ పాత్రను మరింత బలోపేతం చేయాలనే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు.
పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు–కార్యకర్తల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు అండగా నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


