Venkat Reddy : గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవకు కృషి చేస్తా

TRINETHRAM NEWS

తేదీ : 29/12/2025.
ఖమ్మం జిల్లా: (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం, వేంసూరు మండలం , కందుకూరు గ్రామపంచాయతీ భారత రాష్ట్ర సమితి సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆయనకు ఎన్ని వార్డులు సపోర్ట్ చేశాయో వివరించి చెప్పారు.

అదేవిధంగా బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా గ్రామ ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

నేను, ఉపసర్పంచ్ , గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని అన్నారు.

ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని సూచించారు. ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will work for village development and public service

You cannot copy content of this page

Scroll to Top