జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి
త్రినేత్రం న్యూస్: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగురుస్తూ పట్టణీకరణ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంటు అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తెలిపారు. ఈ మేరకు బుధవారం రుడా కార్యాల యంలో కొవ్వూరు మాస్టర్ ప్లాన్ పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ త్వరలో సమస్యలను పరిష్కరించి డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు.

ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తామన్నారు. రుడా పరిధిలో ఆయా పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ద్వారా అక్కడ మౌలిక వసతులు మెరుగు, పరచగలమన్నారు. వైస్ ఛైర్మన్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ,భవిష్యత్తు అవసరా లను దృష్టిలో పెట్టుకొని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొంచించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, రుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Steps towards urbanization

You cannot copy content of this page