Ruling Class took Oath : పాలక వర్గం ప్రమాణస్వీకారం

TRINETHRAM NEWS
డిండి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.
  • కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు.

డిండి( గుండ్ల పల్లి ) డిసెంబర్ 22, త్రినేత్రం న్యూస్. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీల ఎన్నికలలో గెలుపొందిన గ్రామపంచాయతీల పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాలలో భాగంగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండల కేంద్ర గ్రామపంచాయతీ పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం గావించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామలింగేశ్వర రావు, పంచాయితీ కార్యదర్శి జంగయ్య, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ గా నల్లగంతుల రవి, ఉపసర్పంచ్ గా కౌసర్ బేగం, వార్డు సభ్యులుగా వరుస క్రమంలో వేముల శ్రీనివాస్, కూతాటి మహేష్ ,కర్నాటి జయమ్మ, మాకం పావని ,గుర్రం సురేష్, ఆరె కంటి సైదమ్మ, బల్మూరి రాజు, వంగాల దివ్య, సభావత్ జానకి, బుషిపాక బాలయ్య, మాదమోని అమృతయ్య , నూకం మణెమ్మ, మూడవత్ కవిత ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ రవి మాట్లాడుతూ గ్రామస్తుల,ప్రభుత్వ అధికారుల, వార్డు సభ్యుల సహకారంతో గ్రామంలోని సమస్యలు తీర్చుటకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలైనా ఇరిగేషన్ భూములు రైతులకు రప్పించుటకై ,కోతుల బెడద, కుక్కలా బెడద నివారించుటకై, ఇతర సమస్యలను తీర్చుటకై, గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలోగ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు,,మహిళలు, ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ కుటుంబ సభ్యులు, బందు మిత్రులు ,తదితరులు నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The ruling class took oath

You cannot copy content of this page

Scroll to Top