All India Pensioners Day : అఖిల భారత పెన్షనర్స్ డే 2025

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పెన్షనర్స్ సేవాసదనం నందు అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన అఖిల భారత పెన్షనర్స్ డే 2025 సమావేశం జరిగినది. ఈ సమావేశంనకు జిల్లా నాయకులు గాయం నారాయణ రెడ్డి, నూనె రంగయ్య రామలింగం హాజరైనారు. వారు మాట్లాడుతూ దేవరకొండ పెన్షనర్స్ సంఘం కృషి అభినందనీయం అన్నారు. జిల్లాలో ఇంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ ఎక్కడ హాజరు కావడంలేదు అన్నారు. మొదటి అంతస్తూ నిర్మాణం, దాతల సహకారం గుర్తించదగినది అన్నారు. అనంతరం 1953 సంవత్సరంలో జన్మించిన సినియర్ పెన్షనర్స 30 మందిని సన్మానించడం జరిగినది. అనంతరం జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులను, కార్యవర్గంను, కార్యవర్గం సభ్యులను సన్మాణించడం జరిగినది.

ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్య మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహణలో ఆర్థికముగా సహకరించిన పెన్షనర్లకు కృతజ్ఞతలు తెలియజేసినారు. సహా అధ్యక్షులు గంగిడి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ అయిన పెన్షనర్లకు రావాలసిన పద్దులు వెంటనే విడుదల చేయాలని, 5 విడతల కరువు భత్యం అందజేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జగపతిరావు, కార్యనిర్వాహాక కార్యదర్శులు మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, పడమటి శాంతకుమారి, ప్రచార కార్యదర్శి పగిడిమర్రి సత్యమూర్తి, కార్యవర్గం సభ్యులు, 100 మంది పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

All India Pensioners Day

You cannot copy content of this page

Scroll to Top