ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Birthday Celebrations Dr Yekula Rajarao

Birthday Celebrations Dr Yekula Rajarao : దేవరకొండ డివిజన్ జులై 15,త్రినేత్రం న్యూస్. టిపిసిసి (TPCC) ఎస్సీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని బహుజన నాయకులు, దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, యేకుల రాజారావు కి మిఠాయిలు తినిపించి అభినందనలు అందజేశారు. బహుజనుల, దళితుల అభ్యున్నతికి మరియు పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఈ జన్మదిన కార్యక్రమంలో యేకుల సురేష్, బోయిన చంద్రమౌళి, మేడ సైదులు, భయ్య శ్రీను, నారిమల్ల మల్లేష్, అవుట మల్లేష్, ఎర్ర వెంకటయ్య, నిరటి బాలరాజు, చేపూరి మురళి, మరియు నారిమల్ల ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ యేకుల రాజారావు కి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page