ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Minister Kolusu Parthasarathy

Minister Kolusu Parthasarathy : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 15; నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కార్యకర్తలకు వివరించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని కొనియాడారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసి, వంద శాతం విజయాన్ని సాధించేలా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page