- బలభద్రపురం, దుప్పలపూడి గ్రామాల్లో ఘనంగా జగన్, పుట్టినరోజు వేడుకలు
- కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు
- పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన నాయకులు
- జగన్, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్న అభిమానులు, వేడుకల్లో పాల్గొన్న సత్తి ఆదిలక్ష్మి
త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం దుప్పలపూడి, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి , జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు , అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీమణి సత్తి ఆదిలక్ష్మి , హాజరయ్యారు. బలభద్రపురం గ్రామంలో జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. దుప్పలపూడి గ్రామంలో జగన్ అక్షరాలాతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కట్ చేశారు.
ఈ సందర్భంగా జగనన్న ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


