Dr. Satthi : వైసీపీ ప్రభుత్వంలో రైతుకు భరోసా ఉండేది, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

TRINETHRAM NEWS

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ కన్వీనర్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో రైతుకు సంపూర్ణ భరోసా ఉండేది, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులకు ఆ భరోసా కరువైందని అన్నారు. శనివారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో రైతాంగం మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉంది,” అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇన్‌పుట్ సబ్సిడీలు, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్, ఆర్‌బీకే ల ద్వారా రైతులకు అండగా నిలిచారు. అదే విధంగా ప్రస్తుతం కూడా ఈ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం గుర్తించి, తగిన సాయాన్ని అందించాలి,” అని కోరారు.

ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ సుజాత వీర్రాఘవరెడ్డి (ఎంపీటీసీ), నల్లమిల్లి వెంకట రెడ్డి (బుల్ రాజు, వెంకటరెడ్డి), అంబటి సుబ్బారెడ్డి, కర్రి సీతా రామరెడ్డి, కర్రి అచ్చిరెడ్డి (4 వార్డ్ నెంబర్), కర్రి దుర్గారెడ్డి, డోకుబుర్ర సత్యానందం బృందం తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmers had security under YSRCP government

You cannot copy content of this page

Scroll to Top