CPI Dharna : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా అమలు చేయాలని సీపీఐ ధర్నా

TRINETHRAM NEWS

కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని రద్దు చేసే వరకు పోరాటం ఆగదు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు

త్రినేత్రం న్యూస్.. కాకినాడ, డిసెంబర్ 22.. ఈ ధర్నాను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం మతం ముసుగులో జిరాంజీ పథకంగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయంలో గ్రామీణ పేదలకు వలసల నుండి నివారణ కల్పిస్తూ ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. అందులో భాగంగానే మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుతో వికసిత్ భారత్ జిరాంజి పథకంగా పేరు మార్చి కేంద్రం వాటా 90% నుండి 60 శాతానికి కుదించడం ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజులలో రద్దు చేసే ఆలోచనతోనే కేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని వారు పేర్కొన్నారు.

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రం వాటా పది శాతం నుండి 40 శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం ద్వారానే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని వారు అన్నారు. మోడీ ప్రభుత్వం జిరాంజి పథకాన్ని రద్దు చేసే వరకు వామపక్ష పార్టీలు కలిసొచ్చే పార్టీలను సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనువాస్, పి త్రిమూర్తులు, సమితి సభ్యులు టీ నాగేశ్వరావు నల్ల రామారావు, జట్ల సంఘం అధికార బాడీ దేముడు బాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు

ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే మున్ని, వామపక్ష పార్టీల నాయకులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, కురెళ్ళ వరప్రసాద్, ఏ లక్ష్మీ ఇందిరా, భజంత్రీ శ్రీనివాసరావు,ఎం ఇసాక్, కంది విశ్వనాథం, శ్యామల రాణి, జే గోపి, కొండేటి బేబీ, కే సుధారాణి, జి స్వాతి, పి ఆదిశేషు, బళ్ళ కనక దుర్గారావు కే రామాంజనేయులు, జి కోటేశ్వరరావు, కే నరసింహస్వామి, కే రాంబాబు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, బి శంకర్, లెనిన్, జి శివకుమార్, ఎస్ సత్యనారాయణ, అరుణ కుమారి, జి ఏసుబాబు, బి కే యం యు నాయకులు బుగ్గల ప్రభాకర్, బి ఏసు రత్నం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI dharna demands full implementation

You cannot copy content of this page

Scroll to Top