MLA Vegulla : విలీనాన్ని అడ్డు కోవడం ఎవరి తరమూ కాదు

TRINETHRAM NEWS

ఇది నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష…నా ఆకాంక్ష… విలీనం చేసి తీరతా…

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్.. మండపేట నియోజవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కాకుండా చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జిల్లా విలీనం జరిగితీరుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొని మాట్లాడారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను పణంగా పెట్టాలని చూస్తున్నారన్నారు. కావాలనే అమలాపురం లో కొందరు వ్యక్తులతో మండపేట కోనసీమ లోనే ఉండాలని నిరసన లు వ్యక్తం చేయిస్తున్నారన్నారు.

మండపేట విడిపోతే జిల్లా ఆర్థికంగా బలహీన పడుతుందని అమలాపురం వాసులు అంటున్నారని, అయితే ఇది ఏ రకంగానూ సహేతుకం కాదని పేర్కొన్నారు. ఒక ఊరు ఆదాయం స్థానిక పంచాయతీ, మున్సిపాలిటీకో లేదా రాష్ట్రానికో వెళుతుంది తప్పితే జిల్లా కు ఎక్కడా వెళ్ళదన్నారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. ఎవరెన్ని కుయ్యోక్తులు పన్నినా విలీనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ఇది తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. మరో పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో మనమంతా జిల్లా మారిపోతున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కరలేదని వేగుళ్ళ స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

It is not anyone's business to block the merger

You cannot copy content of this page

Scroll to Top