MLA Vegulla : వైసీపీ కి మరో షాక్ తగిలింది

TRINETHRAM NEWS

ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాధం…

ఎమ్మెల్యే వేగుళ్ళ సమక్షంలో టీడీపీ లో చేరిక…

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలంలో వైసీపీ కి మరో షాక్ తగిలింది. ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాధం తన అనుచరులు 26 మందితో కలసి మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సమక్షంలో గురువారం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో ఏడిద 4వ వార్డు మెంబర్ అల్లి శ్రీను, 5వ వార్డు మెంబర్ కప్పల కుమారి, 9వ వార్డు మెంబర్ బొంతా లక్ష్మి, కప్పల రాజేంద్రప్రసాద్, అందుకూరి సన్ని, బూరిగ శ్రీనివాసరావు, కాకిలేటి ధనరాజ్, యడ్ల వీర్రాజు, పల్లి సూర్యారావు, బూరిగ దొరబాబు, వార అభిరామ్, బూరిగ నాగేశ్వరరావు, విప్పర్తి సంతోష్, బూరిగ సుమన్ కళ్యాణ్, మొగడ సూర్యనారాయణ, బూరిగ రాహుల్, డేగపాటి రాజు, బూరిగ ఆనందరావు, పల్లి సన్ని, బూరిగ బాపనయ్య, బూరిగ మనోహర్ పాల్, వల్లూరి భీమయ్య, బూరిగ రాంబాబు, బూరిగ రాకేష్, కె.కె.శ్రీనివాస్, బూరిగ వినోద్ లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సంధర్బంగా సర్పంచ్ ఆశీర్వాధం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని తెలిపారు. అంకితభావంతో పనిచేసి టీడీపీని మరింత బలపరచేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ ను గజ మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, ఏడిద గ్రామశాఖ అధ్యక్షులు పర్వతిన వీర్రాజు, నీటి సంఘం అధ్యక్షులు కొలిపోటి సత్యనారాయణమూర్తి (బాబు), సొసైటి చైర్మన్ గొడవర్తి ఎర్రబ్బు, ఎంపిపి ఉండమట్ల వాసు, మేకా జేజిబాబు, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్, పలివెల దానియేలు, చిట్టూరి ప్రసాద్, అందుకూరి పుల్లాజి, పదం ఆనంద్, గుడాల రామనాధం, లంక రాణా, కుర్మాన శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YCP gets another shock

You cannot copy content of this page

Scroll to Top