Directors Felicitated MLA Vegulla : ఎమ్మెల్యే వేగుళ్ళను సత్కరించిన కౌన్సిలర్లు, డైరెక్టర్లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11, మండపేట మున్సిపాలిటీని గ్రేడ్-2 నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా అప్ గ్రేడ్ చేయడానికి కృషి చేసి సాధించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని గురువారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మండపేట మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కార్పొరేషన్ డైరెక్టర్లు కలిసి దుశ్శాలువా కప్పి, పూల బొకెట్ తో సత్కరించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రేడ్-2 గా ఉన్న మండపేట మున్సిపాలిటీ ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా అప్ గ్రేడ్ చేయించిన ఘనత ఎమ్మెల్యే వేగుళ్ళకు మాత్రమే చెందుతుందని, ఇది ఆయనకు మండపేట పట్టణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని వారు పెర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మండపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి, నిధులు మరింత ఎక్కువ తీసుకురావడానికి దోహదపడుతుందన్నారు. అనంతరం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ ఇచ్చిన హామీ ప్రకారం మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కొరకు ముఖ్యమంత్రి,ని ఒప్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఎమ్మెల్యే వేగుళ్ళను ప్రజలంతా అభినందిస్తున్నారని, ప్రజల ముఖ్య అవసరాలను తీరుస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటారని ఈ సంధర్భంగా వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Councilors, directors felicitated MLA Vegulla

You cannot copy content of this page

Scroll to Top