Demand for Upa Sarpanch : ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్

TRINETHRAM NEWS

Trinethram News : Dec 08, 2025, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు ఉప సర్పంచ్ పదవికి కూడా తీవ్ర డిమాండ్ నెలకొంది. రిజర్వేషన్లు కలిసిరాని చోట్ల, వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటమే దీనికి ప్రధాన కారణం. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. వార్డు సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి భారీగా నగదు ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Full demand for the post of Upa Sarpanch

You cannot copy content of this page

Scroll to Top