త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 5. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కోరారు. ఢిల్లీ లోని గడ్కరీ కార్యాలయంలో కలసి జిల్లాలోని ప్రయాణికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి రూపకల్పన పనులను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు.
అలాగే యానాం – సుకరపాలెం వద్ద జాతీయ రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని కోరారన్నారు. 216 ఏ జాతీయ రహదారిలో జొన్నాడ మరియు ఇతర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని మంత్రి గడ్కరీని కోరినట్లు ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


