పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలి.
త్రినేత్రం న్యూస్, గొల్లప్రోలు,డిసెంబర్,04: ఏపీ బిల్డింగ్, మరియు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భవననిర్మాణ కార్మికుల సమస్యలపై సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే కాకినాడ జిల్లాలో డిసెంబర్ 12వ తేదీన పిఆర్ భవన్ లో ఏపీ బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సదస్సు జరగనుంది. ఈ సదస్సు జయప్రదనిపై గొల్లప్రోలు భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కరపత్ర ఆవిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీర్స్ బిల్డర్స్ వ్యాపారవేత్తలు చెల్లిస్తున్నారు లేబర్ సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలు చెల్లిస్తున్నారని లేబర్ సస్ సకాలంలో చెల్లిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు మాత్రం పథకాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయల నిధులు ఉన్న కార్మికులకు పథకాల అమలు చేయడంలో పాలకుల అలసత్వం వహిస్తూభవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే పాలకుల వైఫల్యాలను ఎండగట్టి కార్మికుల చైతన్య పరిచేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే కాకినాడలో సదస్సు కరపత్రం ఆవిష్కరణ చేసామని, ఈరోజు సామర్లకోట,పెద్దాపురం, గొల్లప్రో లు తదితర ప్రాంతాల్లో కరపత్ర వేసుకుని చేసావని ఆయన అన్నారు. రూపాయల నిర్మాణాలతో అపార్ట్మెంట్లు,కళ్యాణ మండపాలు, షాపింగ్ మాల్ తదితర నిర్మాణాలు చేపడుతున్న వారు మెటీరియల్ ఇన్సూరెన్స్ తో పాటు కార్మికులకు చెల్లించాలని కార్మికులకు చెల్లించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి బాలకృష్ణ, గొల్లప్రోలు కమిటీ అధ్యక్షులు అనిశెట్టి నూకరాజు, ముగ్గు రెడ్డి గంగ బాబు, చెదులూరి రత్నాజీ, మొగలి వరప్రసాద్, కోలా వీరబాబు, సీతాల సత్తిబాబు, బంటుపల్లి శీను, గదుల నూకరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


