BR Naidu : శ్రీవారి సేవకులకు మంచి శుభవార్త

TRINETHRAM NEWS

తేదీ : 24/09/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమలలో శ్రీవారి సేవకులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి. ఆర్ నాయుడు మంచి వార్త చెప్పారు. సేవాకాలం పూర్తి అయిన తర్వాత వాళ్ల విశేష సేవలను గుర్తించి, మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ అంశంపై త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆస్థాన మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సేవకులతో సమావేశమైనారు. శ్రీవారి సేవకులు నిజమైన భగవద్బాంథవులు అని తెలిపారు. వాళ్లకు గౌరవం అనేది నా కర్తవ్యం గా భావిస్తున్నాను అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Good news for Srivari Sevakulam

You cannot copy content of this page

Scroll to Top