MLA Raj Thakur : న్టీపీసీ విశ్వభారతి హైస్కూల్ లో శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణ కేంద్రం ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు న్టీపీసీ హనుమాన్ అఖాడ శిక్షణ కేంద్రం లోని ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రమశిక్షణ, ధైర్యం, శారీరక దృఢత, మానసిక స్థైర్యం పెంపొందించడంలో అఖాడ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని, పాఠశాల స్థాయిలోనే ఈ విధమైన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, దేశభక్తి, సేవాభావం మరింత బలపడతాయని తెలిపారు. అలాగే విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడల్లో, శారీరకాభివృద్ధిలో కూడా ముందంజలో ఉండాలని సూచించారు విశ్వభారతి పాఠశాలలో ప్రారంభించిన హనుమాన్ అఖాడ శిక్షణ కేంద్రం ద్వారా స్థానిక విద్యార్థులు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తీర్చిదిద్దబడతారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ద్వారా కబడ్డీ, రెజ్లింగ్, యోగా వంటి శారీరక వ్యాయామాలపై ప్రత్యేక శిక్షణ లభించనుంది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA inaugurated Sri Hanuman Akhara Training Center

You cannot copy content of this page

Scroll to Top