గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఆషాడ మాసం చివరి రోజు పురస్కరించుకొని స్థానిక 42వ డివిజన్ మేదరి బస్తి నుండి బోటిక్ స్వప్న ఆధ్వర్యంలో భవాని శీను బోనం ఎత్తగా శివసత్తుల ఆటపాటలతో పోతురాజుల విన్యాసాలతో ఘనంగా బోనం కార్యక్రమం జరిగింది. 42 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు అమ్మవారికి బోనం సమర్పించడానికి భారీగా తరలి రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పాల్గొని అమ్మవారి బోనం ఎత్తుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఇక్కడ యువత అన్ని రంగాలలో ముందుండాలని మహిళలు అమ్మవారి ఆశీస్సులతో అన్ని రంగాలలో ప్రాధాన్యత కలిగి ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, సామమూర్తి మరియు డివిజన్ అధ్యక్షులు ఆడేపు దశరథం మరియు స్థానిక వ్యాపారస్తులు అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు బోనం ఎత్తుకొని ఈ కార్యక్రమానికి తరలివచ్చారు మహిళలు మీనాక్షి పద్మ వాసవి అంజలి రాజేశ్వరి స్రవంతి ఐశ్వర్య అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


