అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రంన్యూస్ ఆగస్టు 21 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జె. భగత్‌రాం పిలుపునిచ్చారు. అరకు వెళ్లి మండల కమిటీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కార్మికుల హక్కులను రక్షించాల్సిన బదులు ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు కార్మిక వర్గాలను దెబ్బతీస్తున్నాయి” అని విమర్శించారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీ వేస్ కార్మికులకు కనీస వేతనం ₹26,000 చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ వంటి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికుల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వాల అన్యాయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, భవన నిర్మాణం, ఐకెపి, ఐటిడిఏ, జిసిసి, హాస్పటల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం కొనసాగించాలని తీర్మానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


