CITU : విజయవంతమైన మేడే ప్రదర్శన సభ

TRINETHRAM NEWS

తేదీ : 01/05/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); (ఇంచార్జ్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, కుక్కునూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జిసిసి హమాలి సన్నిధి నుండి మెయిన్ సెంటర్ మీదగా విద్యుత్ కార్యాలయం కిష్టారం, చర్చి వసతి గృహం వద్దకు ఉత్సాహవంతంగా నూట ముప్పై తొమ్మిది వ మేడే ప్రదర్శన సాగింది. పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దం అంటూ భవన నిర్మాణ కార్మికులు , ప్రజా సంఘాలు, అంగన్వాడి, ఆశ, లారీ యానిమేటర్లు కేంద్రాల వద్ద జెండా ఆవిష్కరణలు విజయవంతంగా చేశారు.

కార్యాలయాల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని యం పి డి వో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సిఐటియు మండల కార్యదర్శి వై. సాయి కిరణ్ మాట్లాడుతూ పెట్టుబడి దారి ప్రపంచానికి పుట్టినిల్లు ఆయన అమెరికాలో దాదాపు నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ క్రితమే శ్రమ దోపిడీ కార్మికులు ఉద్యమించినారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినప్పుడు శ్రామికులు బానిసలుగా శ్రమించేవారు.
పారిశ్రామికవేత్తలు అధిక లాభాల కోసం ఆరు, ఏడు ఏళ్ళ పిల్లలతోనూ, మహిళలతోనూ ఫ్యాక్టరీల్లో, గనులలో పనిచేయించేవారు. ఆళ్ళను పట్టించుకునే నాధుడే లేడు. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం నగరవీధుల్లో తమ హక్కులు సాధించాలని పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భముగా మార్పుకు నాంది పలకలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సిపియం కమిటీ జిల్లా కమిటీ సభ్యులు వై. నాగేందర్ రావు, మండల కార్యదర్శి బి. శ్రీను, పి ఐ టి యు మండల కోశాధికారి బి. సుజాత , ఉపాధ్యక్షులు షేక్. వలి పాష తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Successful Mayday demonstration

You cannot copy content of this page

Scroll to Top