Ex-MP Girajala : ఘనంగా మాజీ ఎంపీ గిరజాల మనవరాలు వివాహ వేడుకలు

TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు మనవరాలు వివాహ వేడుకలు కడియం జి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. వధూవరులు గిరజాల సంతోషి, తోట శ్రీనివాస్ లను ఈ వేడుకలకు విచ్చేసిన నేతలు,బంధుమిత్రులు ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు,తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, రాజనగరం, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వరుపుల సుబ్బారావు, విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ(బొత్స సత్యనారాయణ సతీమణి) విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య,బొత్స అప్పలనాయుడు, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకులు వీర్రాజు,రాష్ట్ర కాపు పోరాట సమితి నాయకులు ఆకుల రామకృష్ణ, బిజెపి నాయకులు కంటిపూడి సర్వారాయుడు, తదితరులు ఉన్నారు.

ఈ ముఖ్య అతిధులు అందర్నీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, గిరిజాల బాబు, గిరజాల బాబ్జి, ఈ లి గోపాలం, తాడల చక్రవర్తి, యాదల సతీష్ చంద్ర స్టాలిన్,తదితర కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Girajala's grand-daughter's wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top