త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి అనపర్తి మండలం రామవరంలో రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ .. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 10 తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పెద్ద ఎత్తున తీరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ప్రజలలో పెద్దఎత్తున దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 14వ తేదీన దేశ విభజన గురించి ఒక కార్యక్రమాన్ని కాగడాల ప్రదర్శన నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశించింది. అదేవిధంగా 15వ తేదీన ప్రతీ భారతీయ జనతా పార్టీ కుటుంబం సభ్యులు వారి ఇంటి పైన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించి నియోజకవర్గంలో ఒకచోట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా రాజమండ్రి రూరల్ సభ్యులు శ్రీ ఆకుల శ్రీధర్, ఈ నియోజకవర్గానికి నియమించడం జరిగింది . ఈ రోజున నాలుగు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీలలో ఉన్న కార్యవర్గానికి సంబంధించిన నాయకులు అందరూ సమావేశం కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గంలో ఏవిధంగా కార్యక్రమం చేయాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ కన్వీనర్ రాజు, ఆకుల శ్రీధర్,తో చర్చించిన తర్వాత ఆగస్టు 10వ తేదీన అనపర్తి మండలంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం ద్వారా జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ రామవరం గ్రామం నుండి అనపర్తి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.
అదేవిధంగా ఆగస్టు 10వ తేదీన అనపర్తి లో, 11వ తేదీన బిక్కవోలులో, 12వ తేదీన రంగంపేటలో, 13వ తేదీన పెదపూడిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 14వ తేదీన దేశ విభజన గురించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అదేవిధంగా ఆగష్టు 15 తేదీన అనపర్తి కెనాల్ రోడ్డు వద్ద భారతీయ జనతా పార్టీ జెండా స్థూపం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజలలో దేశం పట్ల అభిమానం దేశభక్తి విపరీతంగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దేశ సమగ్రతను, సార్వబౌమాధికారాన్ని కాపాడే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాజ్ పేయి, ప్రభుత్వ హయంలో పాకిస్థాన్ పై విజయం, అలాగే ఈరోజు నరేంద్ర మోడీ, హయాంలో ఆపరేషన్ సింధూరం ద్వారా పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని సంహరించడం ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఉగ్రవాదానికి అంతం పలికే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుంది.
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పట్ల అనుసరించిన ఉదాసీనత వైఖరి వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. దానిని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కాపాడుతుంది ఆ విషయం ప్రజలందరికీ చాటి చెప్పాలి. దేశభక్తిని పెంపొందించాలి అంటే దేశం పట్ల ప్రజలకు కలిగే అభిమానాన్ని పెంచాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
అందువల్ల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది ఒక భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు దేశం పట్ల ప్రజలందరికీ గౌరవాన్ని తెలియచెప్పే కార్యక్రమం అని తెలియజేస్తూ, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు ఆకుల శ్రీధర్, అనపర్తి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ శివ రామకృష్ణంరాజు,నాలుగు మండలాల బిజెపి అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


