Teaching : బోధన

TRINETHRAM NEWS

తేదీ : 11/07/2025.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , బుట్టాయిగూడెం మండలం లో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్, ప్రభుత్వ ప్రాథమిక, గిరిజన ఆశ్రమ , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూల భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ సమయం ప్రకారం పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.
ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయినింగ్ అయ్యారో చెప్పారు. విద్యార్థులకు సంబంధించి అన్ని మెటీరియల్స్ అందాయి, అదేవిధంగా ఇచ్చామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టిక ప్రకారమే సన్న బియ్యంతో కూడిన అన్నము, మరియు కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు , అదేవిధంగా రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారు చేసినటువంటి చిక్కీలు , విద్యార్థులకు శక్తివంతమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలపడం జరిగింది.

విద్యార్థులు మరియు వాళ్ల తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. కె. కన్నప్పగూడెం కె. రవికుమార్, బండార్లగూడెం టి. సురేష్, లంకపల్లి యం. ఆనందు, పులి రామన్నగూడెం యస్. వెంకటేశ్వరరావు, కన్నరప్పపాడు యం. పెంటారావు, ఉప్పరిల్ల, యం. బాబురావు కోయ కన్నాపురం జి. శిరీష, ముద్దప్పగూడెం పి. దుర్గా భారతి, కొవ్వాడ టి. రమాదేవి, అదేవిధంగా పోలవరం మండలం లక్ష్మీనారాయణ దేవి పేట వి. భాస్కర్ మాట్లాడుతూ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మత్రులందరికు ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Teaching

You cannot copy content of this page

Scroll to Top