Civil Judge : కలిసి కట్టుగా పనిచేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 11/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ బిల్డింగు శిథిల అవస్థలో ఉందని, దానికి కావలసిన ఎస్టిమేషన్ రూపాయలు ఇరవై లక్షల రిపేర్లు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. జాతి కోసం మీడియేషన్ తొంబై రోజుల్లో కేసులు పరిష్కారం కోసం చేస్తున్న స్పెషల్ డ్రైవ్ లో న్యాయవాదులు అందరూ సహకరిస్తారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా తొంబై రోజుల్లో అత్యధిక కేసులు పరిష్కారం కోసం మీడియేషన్ సెంటర్ ద్వారా కృష్ణాజిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాలలో పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసికట్టుగా పని చేయాలని జి. గోపి తెలిపారు.

అదేవిధంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణయ్య మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తులు పరస్పర సహకారంతో కక్ష దారులకు సత్వర నాయం, అందించినప్పుడు న్యాయశాఖ గౌరవ ప్రతిష్టలు , మరింత పెరుగుతాయని , కక్షిదారుల కేసులు పరిష్కారం కోసం ముందుకు వస్తారని , అన్నారు. శిక్షణ పొందిన మీడియేటర్లతో ఉభయ పార్టీలను శాంతియుతంగా పరిష్కరించి, అప్పిల్ లేని విధంగా తీర్పు ఇవ్వడం జరుగుతుందని , న్యాయ వ్యవస్థలో రాబోయే రోజులలో మీడియేషన్ కు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని , పాత కేసులు పరిష్కరిస్తే కొత్త కేసులు వస్తాయని అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటివ్ యల్. వెంకటేశ్వరరావు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు యల్. బాలాజీ, వడ్డీ .జితేంద్ర, తుంగల.

హరిబాబు, కార్యదర్శి సాయణ. సుధాకర్ రావు, ఇతర సీనియర్, జూనియర్ మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. లోకదాలతో కేసులు పరిష్కారం చేసే సమయంలో న్యాయవాదులు తో సంబంధం లేకుండా పోలీసులు కక్షి దారులతో రాజీ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని, దానివల్ల న్యాయవాద వృత్తికి అన్యాయం జరుగుతుందని న్యాయవాది మహమ్మద్ మస్తాన్, జిల్లా జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదనపు జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జిలు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, కృష్ణాజిల్లా పర్మనెంట్ లోకదాల చైర్మన్ , న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We should work together

You cannot copy content of this page

Scroll to Top