తేదీ : 02/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, మండలంలో పల్లెర్లముడి, సీతారాంపురం గ్రామాలలో గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు .పార్థసారథి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు గురించి స్థానికులకు తెలియజేయడం జరిగింది. మంచి ప్రభుత్వం గురించి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


