సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఆర్ జీ 1 ఏరియా 2A గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్వార సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క సమావేశానికి ఐ ఎఫ్ టీ యు రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ , ఏ ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు జీ రాములు, టీ ఎస్ యు ఎస్ నాయకులు పోగుల శేఖర్, టీ ఎన్ ఎన్ టి యు సీ నాయకులు రాజనర్సు లు మాట్లాడుతూ, కార్మిక అనేక పోరాటాలతో,త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను సాధించుకుంటే ప్రభుత్వం వాటిని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చే కుట్రలకు ఒడిగట్టిందన్నారు మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కరోనా సమయంలో పార్లమెంటులో 29 కార్మిక చట్టాలను 4 కోడ్స్ గా బిల్లు ఆమోదం తెలపబడిందని ఇప్పటివరకు కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది అంటే అది కేవలం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యతతో ఉన్నారనే భావనతో మాత్రమేనని ఇట్టి కార్మిక వ్యతిరేక విధానాలైన 4 కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యతను చాటడానికి జూలై 9 న జరగబోయే ఒక్కరోజు సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని లేక పోతే 12 గంటల పని దినంతో పాటు కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఈ 4 కోడ్స్ వల్ల చాలా అంశాలలో కార్మికులకు నష్టం జరిగే విధానాలు ఉన్నాయి కావున మన యొక్క కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి మన వంతుగా మనము సమ్మె విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమం లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎం కొమరయ్య,ఎస్ ప్రసాద్, సంపత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


