తేదీ : 20/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రూపులు ఎంపీసీ, బైపిసి, సి ఈ సి, హెచ్ఈసి , ఒకేషనల్ గ్రూపులో కలవు. ఈ కళాశాలలో జి. కుస్మ ఎమ్మెస్సీ చదివి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి విద్యార్థులకు , మరియు సిబ్బందికి దేవతల నిలిచింది. పోలవరం ముంపు ప్రాంతాలు అయినటువంటి కుక్కునూరు , వేలేరుపాడు, పోలవరం, చుట్టుప్రక్కల ప్రాంతాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా క్రమశిక్షణతో కూడిన విద్య బోధన, ఆటలు మొదలైనవి సమయం ప్రకారం జరుగుతున్నాయి. విద్యార్థులకు బియ్యంతో కూడిన అన్నము పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. జరిగిన పబ్లిక్ పరీక్షలలో జిల్లాలోనే ఈ కళాశాల ప్రథమ స్థానాన్ని చోటు చేసుకోవడం జరిగింది. ఎక్కువమంది విద్యార్థులు, కూడా ఈ కళాశాలలో ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ద్వితీయ సంవత్సరం బైపీసీ గ్రూపులో వేయి మార్కులకు గాను యం. తేజ ఎనిమిది వందల నలభై ఎనిమిది మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది.
ద్వితీయ స్థానాన్ని టి. సాహితీ ఎనిమిది వందలు మార్కులు సాధించింది. ఎంపీసీ గ్రూపులో యస్. మమత ఏడు పందల మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అదేవిధంగా సిఈ సి, హెచ్ ఈ సి , ఒకేషనల్ గ్రూపుల్లో కూడా అత్యధికంగా మార్పులు సాధించి విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకుని వాళ్లకు మంచి విద్య బోధన, నేర్పిస్తున్నామని ప్రిన్సిపా ల్ తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


