కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 20 : సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజాభివృద్ధికి చేయగలిగినంత కృషి చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. మూసాపేట హెచ్పి రోడ్ లోని సాయి సేవా సంఘం ఆహ్వానం మేరకు అనాధ పిల్లల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు, కళలు, వివిధ నృత్యాల్లో తమ ప్రతిభ పాటవాలను అద్భుతంగా ప్రదర్శించారు.
ఈ చిన్నారుల క్రమశిక్షణ అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి సేవా సంఘం చిన్నారులను తీర్చిదిద్దుతున్న విధానాన్ని రమేష్ అభినందించారు. అనాధ పిల్లల పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పరిస్థితులపై చెల్లించిన రమేష్ తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అప్పటికప్పుడే ప్రకటించారు. దీనిపై ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. వారు రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ ప్రతినిధులు ప్రదీప్, అరుణ, సుశీల, నాయకులు లక్ష్మయ్య, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


