తేదీ : 20/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , క్రైస్తవ ముసుగులో ఉన్న ఉన్మాది వైసిపి అధినేత, ఎమ్మెల్యే, వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈ టి స్వామి దాసు మండిపడ్డారు. జగన్ హింసను ప్రేరేపించే విధంగా చేసిన వ్యాఖ్యల ను ఖండిస్తూ గురునానక్ కాలనీలోని ఎంపీ కేసినేని. శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి జాతరలో పొట్టేలు ను నరికితే తప్పేంటి అని ప్రశ్నించడం ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదన్నాడు. ప్రవర్తన మాటలు బట్టి చూస్తే బైబుల్ ను వేనాడు చదివినట్లుగా లేదని తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు. క్రైస్తవుల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పిన ఇంకా మారలేదని, ఇక జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. టిడిపిలో ఎవరైనా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ జాతియ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపేక్షించారని, శిక్షణ చర్యలు తీసుకుంటారని తెలపడం జరిగింది. జగన్ తన పార్టీని క్రమశిక్షణ తో నడిపించలేని అసమర్ధుడు అంటూ విమర్శించారు. ఏసుక్రీస్తు శాంతి, కరుణ, ప్రేమను పంచమన్నాడు కానీ బైబుల్ లో ఎక్కడ హింసను ప్రేరేపించమని చెప్పలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రైస్తవ సెల్ అధ్యక్షులు ఉ ర్ల. మోహన్రావు నాయకులు చాట్ల. రాజశేఖర్, దువూరి. భాస్కర్, కొక్కిలిగడ్డ. ప్రసాద్, మాధవ పాల్, బి. చక్రవర్తి, యాడికి. సామ్ స్వరూప్, పాస్టర్ల్ రత్నం బాబు, గాబ్రియేల్, ఏ ఎస్ వాసు, బిషప్ రబ్బుని లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


