తాగునీటి సమస్య తో సతమతం….
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండపేట పురపాలక సంఘం పరిధిలో ప్రజలు తాగునీరు సమస్యలతో సతమతం అవుతున్నారనీ మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆర్ టి ఐ యాక్ట్ అధ్యక్షులు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆరోపించారు. దీనికి తోడు కరెంటు కోతలు, దోమలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పట్టపగలు వడగల్పులతో తాగునీరు సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. రాత్రిపూట సమయంలో దోమలు పెరిగిపోయయని ద్వజమెత్తారు. కరెంటు కోతలు తో విపరీతమైన నరకయతన అనుభవిస్తున్నారనీ పేర్కొన్నారు. సమస్యల తో చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు సామాన్య ప్రజలుఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దానికి తగ్గట్లుగా రేషన్ షాపులు వద్ద ప్రజలను క్యూ లైన్ లో నిలబెట్టి మండుటెండలో సొమ్మసిల్లిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కోరుకునే సౌకర్యాలు కల్పించాలని వాటి పట్ల శ్రద్ధ చూపించాలని వెంటనే చర్య చేపట్టాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


