MLA Adireddy Srinivas : టీటీడీ లెటర్ల ఫేక్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆ కలియుగ దైవం… ఆపద మొక్కుల వాడు వెంకటేశ్వస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిఫార్సు లేఖల విషయంలో వస్తున్న ఫేక్ ఫోన్స్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తి మేము రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాము…

మీకు టీటీడీ బ్రేక్ దర్శనం లెటర్లు, అభిషేకం, సుపధం తదితర దర్శనాల లెటర్లు, అలాగే రూమ్స్ కోసం లెటర్లు కావాలంటే చెప్పండి మేము ఇప్పిస్తామంటూ ఫోన్ ద్వారా సంప్రదించి డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అటువంటి కాల్స్ ను ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. టీటీడీ సిఫార్సు లేఖలకు సంబంధించి నేరుగా తమ కార్యాలయంలోనే సంప్రదించాలని కోరారు. ఎవరైనా ఫోన్ చేసి సిఫార్సు లేఖలు ఇస్తాం, డబ్బులు ఖర్చు అవుతాయని ఎవరైనా ఫోన్ చేస్తే అట్టి వారిని నమ్మవద్దని, అటువంటి వారి సమాచారం, ఫోన్ నెంబర్ తిలక్ రోడ్డులోని తమ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Be careful about fake calls

You cannot copy content of this page

Scroll to Top