MLA Jyotula Nehru : స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త‌, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం

TRINETHRAM NEWS

రామేశ్వరంపేట విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాకినాడ జిల్లా గండేపల్లి జూన్ 2: గండేపల్లి మండలం సూరంపాలెం శివారు రామేశ్వరంపేట సెంటర్ లో గండేపల్లి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కుంచే రాజా విగ్రహ దాత సుమారు నాలుగు లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలతో నివాళులర్పించారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూబాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌ను ఎమ్మెల్యే నెహ్రూ స్మ‌రించుకున్నారు. దేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త‌, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం అని నెహ్రూ పేర్కొన్నారు.దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శ‌నికుడు బాబూజీ అని ఎమ్మెల్యే చెప్పారు. బాబు జ‌గ్జీవ‌న్ రామ్ దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారు.

కార్మిక లోక ప‌క్ష‌పాతి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్. బాబూజీ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీకుంచె రాజా, ఎమ్మార్పీఎస్ నాయకులు సీనియర్ న్యాయవాది కొండేపూడి ఉదయ్ కుమార్, డాక్టర్ కొండేపూడి రాజాజీ, గండేపల్లి, జగ్గంపేట మండలాలటిడిపి అధ్యక్షుడు పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రం, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు కుంచే రామకృష్ణ, కొండేపూడి రాహుల్, బొల్లంరెడ్డి రామకృష్ణ, అల్లం గోవిందు, మందపల్లి సత్యనారాయణ, గెడ్డం నూకరాజు, కతారి ఏసు రాజు, తాతపూడి వెంకటరమణ, పెదపూడి అప్పారావు, చెప్పల చిన్న రాంబాబు, జుత్తుక నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Freedom fighter, social reformer,

You cannot copy content of this page

Scroll to Top