కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీయే

TRINETHRAM NEWS

వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం

ప్రాంతీయ పార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం

మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

కార్యకర్త కుటుంబానికి బీమాతో ధీమా ఉంటుందని కృతజ్ఞతలు తెలిపిన త్రినాథ్‌ తల్లి నాగ మల్లీశ్వరి
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతిచెందిన 14వ డివిజన్‌ టీడీపీ కార్యకర్త బోగారపు త్రినాధ్‌ కుటుంబానికి రూ.5 లక్షల బీమా నగదు మొత్తం నామిని అయిన త్రినాధ్‌ తల్లి నాగమల్లేశ్వరి బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్‌ పంపిన లేఖను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందని అన్నారు. కార్యకర్తకు వచ్చే రూ.5 లక్షల బీమా మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల్లో నామిని బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు.

ఆ విధంగానే మృతి చెందిన త్రినాధ్‌ తల్లి మల్లేశ్వరి బ్యాంకు ఖాతాలో బీమా మొత్తం రూ.5 లక్షలు జమ అయిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. పార్టీ కోసం పని చేసిన త్రినాధ్‌ లేకపోయినా ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అందివచ్చిన కొడుకును కోల్పోయిన వారి తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. త్రినాధ్‌ కుటుంబానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ఒక లేఖ పంపించారని, తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు కార్యకర్తగా త్రినాధ్‌ ఎంతోసేవ చేశారని, కష్టకాలంలో పార్టీ వెన్నంటి నడిచారని ఆయన అకాల మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటని ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. త్రినాధ్‌ తల్లి మల్లేశ్వరి పేరున బ్యాంకు ఖాతాలో జమ అయిన బీమా మొత్తం రూ.5 లక్షల గురించి ఆమెకు ఆలేఖ ద్వారా తెలియ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. అలాగే ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు.

అది తెలుగుదేశంపార్టీకి కార్యకర్తలు, వారి కుటుంబం పట్ల ఉండే అభిమానం, అంకితభావం, బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. త్రినాధ్‌ తల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ కార్యకర్తలకూ బీమా సదుపాయం ఉంటుందని తెలిసి ఎంతో ఆశ్చర్యం, సంతోషం కలిగిందని, తన కుమారుడు అకాల మరణంతో బాధలో ఉన్న తమ కుటుంబానికి ఈ బీమా మొత్తం కొంతవరకు భరోసా కల్పించిందని, అది కాకుండా స్వయంగా రాష్ట్ర మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తమకు లేఖ ద్వారా సంతాపం తెలియచేసి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఎంతో ఆత్మ స్థైర్యం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, ఈతలపాటి రవిబాబు, బంగారు నాగేశ్వరరావు, యర్రంశెట్టి రాజ్‌కుమార్‌, నీలాపు వెంకటశ్వరరావు, ఉడమల నాగేశ్వరరావు, మోర్స సోమరాజు, గొర్రిపర్తి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP considers workers as

You cannot copy content of this page

Scroll to Top