తేదీ : 24/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, రామన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే సొంగా. రోషన్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్లు ఆర్జీ పత్రాలపై సమస్యలను వ్రాసి ఎమ్మెల్యేకు అందజేయగా సంబంధిత అధికారులను వెంటనే పిలిచి ఆ సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా భరోసా ఇవ్వడం జరిగింది.
రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం యొక్క టిడిపి నాయకులు, వాళ్ల మాటల్లో గత ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో, కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో వివరించారు. చీకటిగా ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఉదయించే సూర్యుడు వలె గెలుపునిస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే రోడ్డు బాగోలేకపోవడం వల్ల ఆ రోడ్డు గురించి సంబంధిత అధికారులతో మాట్లాడామని త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం అవుతుందని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మాట టిడిపి నుండి పుట్టిందని ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూటమి నాయకులు, కార్యకర్తలు ద్వారా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తున్నాము, అని అన్నారు. ప్రజాసేవ కోసం మేము ఎప్పుడూ ముందు ఉంటామని, సమస్య వస్తే పరిష్కారమే మేము అని తెలిపారు. పల్లెనిద్ర కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎటువంటి లోటుపాట్లు, లేకుండా, రాకుండా కూటమి నాయకులు చూసుకున్నారు. అందరికీ భోజన వసతి కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి తెలుగు యువత ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యం. మాజీ యం.పిపి నాగేశ్వర్ రాంబాబు,జి. రాంబాబు, డి. సత్యనారాయణ, కె. రవి, ఏసు పి. ధర్మారావు, ఆర్. ప్రసాద్, టి. నాగేశ్వరరావు, సి. రాము, కె. కాంతారావు, సి. బాబురావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


