మతాన్ని నమ్ముకున్నోడు రాక్షసుడు – ధర్మాన్ని నమ్ముకున్నోడు మనిషి ..
మేడా శ్రీనివాస్, జగత్ సత్యాలు..
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
Trinethram News : భారతీయుల సాహస మరణం దేశ భద్రతకై వుండాలి . దేశ ద్రోహం కై ఉండరాదు .
భారతీయ తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో దేశ భక్తిని నింపాలి . అక్కరకు లేని గారం, ప్రేమతో ఉండరాదు .
భారతీయుల పాఠ్యంశాల్లో స్వదేశీ చారిత్రిక త్యాగాలను , పోరాటాలను ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి .
ప్రస్తుత భారతీయ పాఠ్యంశాల్లో భారత్ ను ఆక్రమించుకున్న ఆక్రమ దారులుకు వున్న ప్రధాన్యత మన భారతీయుల త్యాగాలు పోరాటాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వక పోవటం భారతీయుల దురదృష్టం..
భారత్ లో మతసామారస్యంతో పాటుగా దేశ రక్షణ ప్రతి భారతీయుడు జన్మ కర్తవ్యం అని పాఠ్యంసాల ద్వారా తెలియ చేయాలి . భారతదేశంలో ప్రస్తుతం అమల్లో వున్నటు వంటి బూజపట్టిన కొన్ని వ్యవస్థలను రద్దు చేసి ప్రజలకు ప్రభుత్వాలపై పూర్తి నమ్మకం కల్పించాలి .
దేశ ద్రోహం చేయని ఏకైక పౌరులు భారతీయులు అని ప్రపంచానికి తెలియ చేయాలి . అందుకు ప్రస్తుత పాలకులను పూర్తిగా సంస్కరించుకోవాలి .. మత గ్రంధాల కన్నా సంస్కృతి, సాంప్రదాయలే పవిత్ర మైనవి అవే దైవ సందేసాలను తెలిపే గురువులను , భోదకులను మాత్రమే ప్రజలు ప్రోత్సాహించాలి .
ఆధిపత్య ధోరణికి తావులేని దైవ ప్రార్థకులకు మాత్రమే దైవ అనుగ్రహం దక్కుతుంది . దైవం వుందని బ్రతికేవారు మానవత్వాన్ని జయిస్తారు. లేదని బ్రతికే వారు రాక్షసులుగా ఆకారణ మరణాలకు చేరుకుంటారు .
ప్రస్తుతం దైవ ప్రాగణాలకు వెళ్లె వారు , దీక్షలకు పూనే వారు వారిలో గల అత్యాశ , దుర్బుద్దిని, స్వార్థం, క్రూరత్వం, మోసం వంటి వాటిని వదులు కున్న వారికే దైవ ఆశీస్సులు దక్కుతాయని చారిత్రిక ఋజువులు వున్నాయి . లేని వారికి దరిద్ర్యం , అనారోగ్యాలు నిత్యం వెంటాడుతుంటాయి.
ప్రకృతిని కాపాడుకోకుండా దైవ ఆశీస్సులు పొందాలనుకునే వారు మూర్కులు . అజ్ఞానులు . వారిని అనుసరించటం పాతాళ దరిద్రులుగా మిగులుతారు . ప్రకృతిని కాపాడుకునే వారికి , పాలనను కలుషితం చేయని వారికి దైవ శక్తి నిత్యం తోడుగా ఉంటుంది . భారతీయ మహిళ ప్రకృతి లో ఒక భాగం అని నమ్మాలి.
స్త్రీని రక్షించే వారి వద్దను , మాతృత్వాన్ని గెలిచే మహిళ వద్దను సంకల్ప శక్తి, వాక్ శుద్ధి మెండుగా ఉంటాయి . దురదృష్ట వసాత్తు భారతీయ మహిళ హక్కులు , శృతిమించిన స్వేచ్ఛ అంటు తన శక్తిని తనే కోల్పోతుంది .
మతం మనుషులను నాశనం చేస్తుంది . ధర్మం వ్యవస్థలను , సమాజాన్ని నిరంతరం కాపడుతుంది . బిడ్డలకు మంచి ఉత్తమ భవిష్యత్ ను ఇస్తుంది . నేటి కలియుగ యుగంలో సెలబ్రేటీస్ గా చాలామణి అవుతున్న వారిలో అనేకులు రాక్షసులు . సన్నాసులు లేనని, వీరు బ్రతుకు జీవితాన్ని మాత్రమే గెలుస్తారు. మరణాన్ని గెలవలేరు .
ప్రపంచంలో ఏకైక దైవ శక్తి గల దేశం ఒక్క అఖండ భారతదేశం మాత్రమే . భారత్ ను శాసిస్తున్నది మాత్రమే పాలకులు . రక్షిస్తున్నది కాపాడుతున్నది మాత్రం దైవ శక్తి అని నమ్మాలి . దైవ రహస్యం , ఉత్తమ గురువు ఆంతర్యం పై పరిశోధనలు జరపాలనుకోవటం విద్రోహం వంటిది . మంచిని పంచాలనుకోవటం సామాజిక భాద్యతా దృక్పధం వంటిది .
నేడు పవిత్ర గ్రంధాలు అనుకుంటున్నటు వంటిని ఎప్పుడో కొంతమంది కలుషిత భోదకులు నాశనం చేసేసారు . నేడు వున్నది ధర్మం ఒక్కటే మిగిలి వుంది . మతం కోసం ఆధిపత్య పోరు సాగించే వర్గాలు అన్ని రాక్షస తెగలు . ధర్మం కోసం పోరాడే వర్గాలు అన్ని మనుష్య తెగలు .
రాసాయినిక కలుషిత నైవేధ్యాలను దైవానికి అర్పిస్తు దైవ ఆశీస్సులు దక్కాలనుకునే ముర్కులుకు దైవ అనుగ్రహం దక్కుతుందా ! అబద్దాన్ని నిజం గాను , నిజంను అబద్దంగాను బ్రతికే బానిసలుగా మార్చేసిన ప్రస్తుత పాలకులు .
ఆశాస్త్రియతను శాస్త్రియతగా నమ్ముతున్న నేటి సమాజానజం మార్పును కోరుకోవాలి . అప్పుడే సామాజిక భద్రత, మానవ భద్రత సాధ్యం . ఉన్న భూ గ్రహాన్ని పూర్తిగా పాడు చేసుకుంటు మరో కొత్త గ్రహాన్ని అన్వేషయించుకుంటున్న ప్రపంచ మేతావులు ఈ కలియుగం లోనే ఉన్నారా !
పూర్తి స్థాయి భద్రత , ఆరోగ్యం, పేదరికం లేని జీవితం , మత సామరస్యాన్ని కొరకునే దేశ భక్తులకు ” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” ను ప్రోత్సహించండి .
–మేడా శ్రీనివాస్ , MA, LLM, MA(జర్నలిజం), MA(Mjmc),
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ .
మొబైల్ : 9248777222
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


