అల్లూరిజిల్లా (గూడెం కొత్త) వీధి త్రినేత్రం న్యూస్ మే 23 : గూడెం కొత్తవీధి మండలంలోని చింతలవాడ గ్రామంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో జర్రెలా పంచాయితీకి చెందిన ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, పీసా అధ్యక్షులు సహా పలువురు గ్రామస్తులు జనసేన పార్టీలో చేరారు. మండల ప్రధాన కార్యదర్శి జీకే వీధి జనసేన నాయకులు పొత్తూరు విష్ణుమూర్తి, చిక్కుడు అశోక్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సమావేశానికి జనసేన పాడేరు నియోజకవర్గ ఇంచార్జి గంగులయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణపై ప్రశ్నలు స్పందించిన గంగులయ్య మాట్లాడుతూ, “గిరిజనుల ప్రయోజనాలే మా పార్టీకి మొదటి ప్రాధాన్యత. అధికారాన్ని లక్ష్యంగా కాకుండా, బాధ్యతగా భావిస్తూ గిరిజనుల హక్కులు, చట్టాలు పరిరక్షించడమే జనసేన రాజకీయ ప్రయాణం,” అని అన్నారు.
అవినీతి, అరాచక పాలనపై పోరాటం చేయడం, గిరిజనులలో అవగాహన పెంచడం, యువతతో కలిసి ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కారాల కోసం మూడంచెల కార్యాచరణ ప్రణాళిక అమలుచేస్తున్నట్టు వెల్లడించారు.
జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై చింతలవాడ గ్రామ యువత, ప్రజలు పార్టీ కండువాలు ధరించి పార్టీలో చేరారు. ముఖ్యంగా పీసా ఉపాధ్యక్షుడు చిక్కుడు అశోక్, ఉపసర్పంచ్ పొత్తూరు వెంకటేష్, వార్డ్ మెంబర్ కొంతులంగి భగవాన్ ధర్మరాజు, గసాడి వెంకట్రావు, ముర్ల శీను బాబు, మణుగూరు ప్రసాద్, చిట్టి బాబు, వెంకట్, గణేష్ రావు, రంగారావు, రామారావు, కృష్ణ, కొండపల్లి తదితరులు జనసేన కండువాలు కప్పుకుని గంగులయ్య సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో గూడెం మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్, సిద్దార్థ్ మార్క్, కొయ్యం ఇమ్మానుయేల్ సిద్దు, మజ్జి సంతోష్, వనపల ఈశ్వర్, గడుతూరి పరిమేశ్వరరావు, మజ్జి సత్యనారాయణ, సర్పంచ్ కృష్ణ వంశి, సాలెబు అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


