Janasena : కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ

TRINETHRAM NEWS

జనసేన పార్టీ నిరసన దీక్ష..

రావులపాలెం: త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం రావులపాలెంలో నిరసన దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మూడు రోజులపాటు చేపట్టిన నిరసన లలో భాగంగా రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తాపం తెలియజేసి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కుటుంబాలుమృతుల కుటుంబాలకు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుందని బండారు శ్రీనివాస్ తెలిపారు.దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిని కఠినంగాహ శిక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నేత బండారు సంజీవ్, కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Condemning the terrorist attack

You cannot copy content of this page

Scroll to Top