100% రిజర్వేషన్ కోసం ఆదివాసీ హక్కుల పోరాటాలు ఉధృతం
అల్లూరిజిల్లా(అరకువేలి) అరకు నియోజవర్గం ఇంచార్జ్ త్రినేత్రం న్యూస్ మే 6: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు మర్రి కామయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల ఎంపీడీఓ లోవరాజు మాట్లాడుతూ, “మర్రి కామయ్య గారి సేవలు అనంతమైనవి. ఆయనకు నివాళి అర్పించడం గర్వకారణం” అని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, “1930-40ల కాలంలో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మర్రి కామయ్య స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామిగా మారారు. బ్రిటిష్ పాలనలో వెట్టి చాకిరి వ్యతిరేకంగా, ఆదివాసుల హక్కుల కోసం తీవ్రంగా పోరాడారు. స్వాతంత్ర్యం అనంతరం సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఆదివాసుల అభివృద్ధికి కృషి చేశారు” అని తెలిపారు.
ఇటీవల మెగాడీఎస్ ప్రకటనలో ఆదివాసులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన ఆయన, “నోటిఫైడ్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు మినహాయింపు ఇవ్వాలి. ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆదివాసులకు 100% రిజర్వేషన్ చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు సుంగరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు, మండల నాయకులు కిలో జగన్నాథం, పాంగి రామన్న, కొర్రా మగ్గన్న, కిన్నంగి రామారావు, కేశవ్, బాలకృష్ణ, సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


