త్రినేత్రం న్యూస్ పెనుమూరు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంపత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు చిత్తూరు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడడం కోసం అనేక రకాలుగా పోరాటం చేస్తూ భారత ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తెలియపరుస్తూ ముందుకు సాగుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుల వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ శివకృష్ణ, ఏపీ ఉపాధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ధనుంజయ నాయుడు, మహిళా అధ్యక్షురాలు పార్వతి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


