భరతమాతకు 22 సంవత్సరాల సేవలందించిన ఎర్రబెల్లి గ్రామం ముద్దుబిడ్డ

TRINETHRAM NEWS

మే 5 (త్రినేత్రం న్యూస్) హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన గొర్రె వెంకటమ్మ శంకరయ్య దంపతులకు జన్మించిన పెద్ద కుమారుడు గొర్రె నరేష్ భారత జవానుగా భరతమాతకు 22 సంవత్సరాలుగా సేవలందించి పదవి విరమణ పొంది స్వగ్రామం ఎర్రబెల్లికి రావడం జరిగింది.

వివరాల్లోకి వెళితే గొర్రె నరేష్ విద్యాభ్యాసం ఎర్రబెల్లి ముల్కనూర్ లో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి దేశం మీద ప్రేమతో భారత సైనిక దళంలో తల్లిదండ్రులు మరియు సతీమణి ఉషారాణి కుటుంబ సభ్యుల సహకారంతో 22 సంవత్సరాలు భరతమాతకు అమూల్యమైన సేవలు అందించి స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులు బంధుమిత్రులు గొర్రె నరేష్ కు ఘన స్వాగతం పలికారు భారత జవాన్ అధికారిగా సేవలందించడం మాకు గర్వకారణం అని కొనియాడారు గ్రామంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ నుండి తన నివాసానికి ఊరేగింపుగా కనుల పండుగగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు తన తోటి విద్యార్థులు పాల్గొని పదవి విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top