అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
Join tdp

Join TDP : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 24; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.
డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ , నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు ,జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తా రెడ్డి ,మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ వాళ్లందరూ 25 మంది వైసిపి నాయకులు, కార్యకర్తలకు పసుపు కండువాలు మెడలో వేసి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరావు , మండల మాజీ అధ్యక్షులు ముళ్లపూడి శ్రీను , సీనియర్ నాయకులు లింగాల సత్యనారాయణ తదితరులు పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page