
Financial Assistance : కూకట్పల్లి అక్టోబర్ 24 త్రినేత్రం న్యూస్ : పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఉన్నత విద్యలో అండగా నిలుస్తున్న శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ట్రస్ట్ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో 63 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా, గంప నాగేశ్వరరావు, మోటివేషనల్ స్పీకర్ అవినాష్ బ్రహ్మదేవర గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
గత నాలుగేళ్లలో 42 మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించామని, ప్రతి సంవత్సరం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కళాశాల ఫీజుల రూపంలో సహకరిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ట్రస్ట్ సహకారంతో చదువుకున్న ముగ్గురు విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దుబ్బ అనిల్ కుమార్, శాశ్వత గౌరవాధ్యక్షుడు కొత్తమాసు మురళీధర్, వ్యవస్థాపక అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం, కోశాధికారులు, కార్యవర్గ సభ్యులు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 700 మంది హాజరై ట్రస్ట్ సేవలను అభినందించారు.విద్యతో వెలుగులు.. సేవతో భవిష్యత్తు అనే లక్ష్యంతో మరింత మంది పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ట్రస్ట్ కృషి చేస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe