
CPI : డిండి గుండ్లపల్లి సెప్టెంబర్ 28, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని సిపిఐ ప్రజాభవన్ లో షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ డిండి మండల అధ్యక్ష కార్యదర్శులు కాంపల్లి ప్రవీణ్, ఎలిమినేటి నరేష్ షాహిద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ డిండి మండలంలోని ప్రజలందరికి షాహిద్ భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా
ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్,బ్రిటిషర్ల గుండెల్లో గుబులు పుట్టించిన వీరుడు భగత్ సింగ్ అని వారు కళలుగన్న ఆశయం కోసం నిత్యం పోరాడుతామని భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని యువత అవినీతిపై పోరాటాలు చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షులు జంగిలి కొండల్, అరుణ్, చింటూ, జంగయ్య, తిర్పత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe