సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Nutrition Month

Nutrition Month : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకు పల్లి .గ్రామంలో పోషణ మాసం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిండి సెక్టార్ సూపర్ వైజర్ ఎం. రేణుక ఈ సందర్భంగా మాట్లాడుతూ..,. అంగన్వాడీ కేంద్రంలో ఒక్కపూట సంపూర్ణ భోజనము ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందించబడుతుందని, గర్భిణీ లు ,బాలింతలు మూడు సంవత్సరాల పిల్లలకు అందరూ వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది ఐరన్, కాల్షియం, లోపము రాకుండా రాగిజావ , బెల్లం , పల్లీలు ఆకు కూరలు, సీజన్స్ పండ్లు తినడం , ప్రతి తల్లి తండ్రి పిల్లలు తీసుకొవలసిన ఆహారం పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని మరియు రైతులు జొన్న సద్ద లను పండించిన పంటను మన కోసము కుడా వాడాలని చెప్పడం జరిగింది. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తున్నమనీ మరియు శిశువు లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్,కార్యదర్శి ,అంగన్వాడి టిచర్ పార్వతమ్మ , ఆశ,వార్డు మెంబర్ లు కిశోర తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతమైన నిద్ర మరియు కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం.. బెస్ట్ మెగ్నీషియం గ్లైసినేట్ సప్లిమెంట్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page