సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Journalist Affected Fire Accident

ప్రజావాణిలో కలెక్టర్ మను చౌదరికి దరఖాస్తు చేసిన ఎర్ర యాకయ్య

Journalist Affected Fire Accident : కూకట్‌పల్లి, సెప్టెంబర్ 28 త్రినేత్రం న్యూస్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యు జె ఎఫ్) కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలిసి దరఖాస్తు సమర్పించారు.కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ‘త్రినేత్రం’ పత్రిక విలేకరి జీ. మనోహర్ ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైందని ఎర్ర యాకయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందన్నారు.విలేకరి మనోహర్ కుటుంబ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ ప్రభుత్వం ద్వారా తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరిని కోరారు.దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో త్రినేత్రం పత్రిక కూకట్‌పల్లి విలేకరి జీ. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నుండి మీ కుటుంబానికి, ఆస్తికి శ్రీరామరక్ష! ECO FIRE 6 Kg ఫైర్ ఎక్స్‌టింగిషర్.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page