
Representation Submitted : అనంతగిరి ఆగస్టు 27, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాల రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిన్నపల్లి శ్రీనుకు వినతిపత్రం సమర్పించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.
పినకోట పంచాయతీ పరిధిలోని వీరభద్రపురం నుంచి జీనబడు పంచాయతీ పరిధిలోని వలసల గరువు వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కొండిబ పంచాయతీ పరిధిలోని సాడ జంక్షన్ నుంచి కోసమామిడి కప్పటవలస వరకు రహదారి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రహదారి సౌకర్యం లేక ఆయా గ్రామాల గిరిజనులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారjanaని చిట్టం మురళి తెలిపారు. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామాలకు చేరుకోలేకపోవడం, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులను ఆసుపత్రులకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
వీరభద్రపురం–వలసల గరువు ప్రాంత ప్రజలు రైవాడ రిజర్వాయర్ మీదుగా పడవలపై ప్రయాణించాల్సి వస్తోందని, వర్షాకాలంలో ఈ ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరారు.
ఈ రెండు రహదారుల నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, నిత్యావసర సరుకుల సరఫరా, అత్యవసర సేవలు మెరుగుపడతాయని మురళి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, సమస్యను ప్రాధాన్యతగా పరిగణించి సంబంధిత అధికారులతో పరిశీలన చేయించి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చిన్నపల్లి శ్రీనును కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి పాంగి లక్ష్మణ్ పాల్గొన్నారు. గిరిజన ప్రాంత ప్రజల చిరకాల రహదారి సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe