ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Boddupalli Krishna

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్!ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.

బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Boddupalli Krishna : దేవరకొండ డివిజన్ ఆగష్టు 28, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫామ్‌లు అందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…..ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్‌లు సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, మూడు నెలలుగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూనిఫామ్‌లు లేక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దునిద్రలో ఉందని మండిపడ్డారు.విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను మాత్రం గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.విద్యార్థులకు వెంటనే యూనిఫామ్‌లు అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page